డిచ్పల్లి, ఆగష్టు 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో శనివారం కూడా డిగ్రీ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు.
ఉదయం 10:00-12:00 గంటల వరకు డిగ్రీ ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ పరీక్షలకు మొత్తం 5 వేల 104 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 4 వేల 832 మంది హాజరు, 272 మంది గైర్హాజరు అయినట్లు ఆయన తెలిపారు.
మధ్యాహ్నం 2:00-4:00 గంటల వరకు డిగ్రీ నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు మొత్తం 7 వేల 784 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 7 వేల 190 మంది హాజరు, 594 మంది గైర్హాజరు అయినట్లు ఆయన తెలిపారు.
మధ్యాహ్నం జరిగిన డిగ్రీ నాల్గవ సెమిస్టర్ పరీక్షల్లో కామారెడ్డిలోని తెలంగాణ గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో గల పరీక్షాకేంద్రంలో వెబ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్‌ల్లో ఇద్దరు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతూ డిబార్ అయినట్లు ఆయన తెలిపారు.