కామారెడ్డి, ఆగష్టు 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కరోనా సమయంలో రక్తదానం ప్లాస్మా దానం చేయడమే కాకుండా 2007లో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని ఏర్పాటు చేసి ఇప్పటివరకు వ్యక్తిగతంగా 63 సార్లు, సమూహం ద్వారా 8 వేల 500 యూనిట్లకు పైగా రక్తాన్ని, కరోణ సమయంలో 850 యూనిట్ల రక్తాన్ని, 100 యూనిట్ల ప్లాస్మాను అందజేసి వేలాది మంది ప్రాణాలను కాపాడిన కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలుకు ప్రశంస పత్రాన్ని తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, కామారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శోభ, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అందజేసి అభినందించారు.
తన సేవలను గుర్తించి అభినందించిన కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్‌కు, కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ ప్రధాన కార్యదర్శి రాజన్నకు, రక్తదాతలకు కృతజ్ఞతలు తెలిపారు.