నిజామాబాద్, ఆగష్టు 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తెలంగాణ జాగృతి నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. త్రివర్ణ పతాకావిష్కరణ చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రామ్ కిషన్ రావు మాట్లాడుతూ ఎంతోమంది మహనీయుల త్యాగ ఫలితమే స్వాతంత్రం అని గుర్తు చేశారు. వారి త్యాగాలు వృధా పోరాదని పేర్కొన్నారు.
దేశాన్ని మనము అభివృద్ధి చెందేలా చూడాలని అందరూ భాగస్వాములై దేశాన్ని అభివద్ధి చెందించినప్పుడు స్వాతంత్య్ర యోధులు సంతోషిస్తారని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు నరాల సుధాకర్, లక్ష్మీనారాయణ భరద్వాజ, అపర్ణ, కుల్దీప్, సంతోష్, రాజన్న, దండు శ్రీకాంత్, సాయికృష్ణ, కోయ్యాడ శంకర్, గోపాల్, సందీప్, దామోదర్, శోభ, వాసంతి, పద్మ, విక్కి తదితరులు పాల్గొన్నారు.