యూనివర్సిటీలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

డిచ్‌పల్లి, ఆగష్టు 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనం ఎదుట ఆదివారం ఉదయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ మువ్వన్నెల జాతీయ జెండా ఆవిష్కరించారు. అంతకు ముందు రిజిస్ట్రార్‌ ఆచార్య నసీంతో కలిసి రిపబ్లిక్‌ పెరేడ్‌ కు ఎంపికైన ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్స్‌ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం గాంధీజీ, అంబేద్కర్‌ చిత్రపటాలకు పూల మాలలు సమర్పించి, జ్యోతి ప్రజ్వలన చేశారు.

ఈ సందర్భంగా వీసీ తెలంగాణ విశ్వవిద్యాలయ సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. 75 సంవత్సరాల భారత స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఆజాది కా అమ ృత్‌ మహోత్సవ్‌’’ కార్యక్రమాలను చేపట్టి భారతదేశం నూతన విద్యా విధానాన్ని అమలుపరుస్తుందని అన్నారు. సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా భారతదేశం పురోభివృద్ధి సాధించడానికి ప్రయత్నం చేస్తుందన్నారు.

కరోనా మహమ్మారిని ఎదుర్కొని ధైర్యంగా ముందుకు నడుస్తూ ప్రపంచ దేశాలకు స్ఫూర్తిని అందిస్తుందన్నారు. అదే విధంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో అత్యాధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రామాణిక పరిశోధనా రంగాన్ని అభివృద్ది చేస్తామన్నారు. కెమిస్ట్రీ, పార్మా కెమిస్ట్రీ, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ విభాగాలలో ఆధునిక నూతన ఆవిష్కరణలను చేపట్టడం కోసం అవసరమైతే విదేశాలలోని విశ్వవిద్యాలయాలతో ఎంఓయూ ఏర్పరుచుకుంటామని అన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలలో పరిశోధనా నేపథ్యాన్ని పెంపొందిస్తామని తెలిపారు.

రిజిస్ట్రార్‌ శుభాకాంక్షలు తెలుపుతూ నాక్‌ అక్రిడియేషన్‌ సాధించడం కోసం పూర్తి ప్రయత్నం చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. చివరగా జాతి సమైక్యతకు చిహ్నంగా ఎన్‌ఎస్‌ఎస్‌ నిర్వహించిన ‘‘రన్‌’’ లో వీసీ రిజిస్ట్రార్‌తో పాటు విశ్వవిద్యాలయ సిబ్బంది భాగస్వాములయ్యారు.

కార్యక్రమంలో ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఆచార్య పి. కనకయ్య, ఎన్‌ఎస్‌ఎస్‌ కో- ఆర్డినేటర్‌ డా. ప్రవీణాబాయి, ప్రిన్సిపాల్‌ డా. వాసం చంద్రశేఖర్‌, స్పోర్ట్స్‌ ఇంచార్చ్‌ డా. మహ్మద్‌ అబ్దుల్‌ ఖవి, డా. రాంబాబు, డా. త్రివేణి, డా. శాంతాబాయి, డా. అథిక్‌, డా. సాయిలు, డా. జమీల్‌, డా. మహేందర్‌, టి. సంపత్‌, డా. స్రవంతి, వినోద్‌, సాయాగౌడ్‌, భాస్కర్‌, ఉమారాణి, యాదగిరి, నేత తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »