జిల్లా కేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

నిజామాబాద్‌, ఆగష్టు 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్రం సిద్ధించి 75 వ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆజాదీకీ అమ ృత్‌ మహోత్సవ్‌ జరుపుకుంటున్న సందర్భంగా జిల్లాలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోలీస్‌ పరేడ్‌ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పోలీస్‌ గౌరవ వందనం స్వీకరించారు. అధికారులు అనధికారులతో పరిచయం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పలు శాఖల ద్వారా పేద ప్రజల కొరకు, అర్హులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలతో సహా ప్రసంగించారు. పలు శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 11 శకటాలు 15 స్టాల్స్‌ పరిశీలించారు.

గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ విద్యార్థినిల, పోలీస్‌ శాఖ, డిపిఆర్‌ఓ కళాజాత, ప్రభుత్వ ఆసుపత్రి, ప్రశాంత్‌ మాస్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్క ృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకర్షించాయి. 2018 రుణమాఫీకి సంబంధించి 25 వేల పైన 50 వేల వరకు 27 వేల 601 మంది రైతుల రుణ ఖాతాల్లో 85 కోట్ల 85 లక్షల రూపాయలను నేటి నుండి జమ చేయుటకు చెక్కును మంత్రి విడుదల చేశారు.

డిఆర్‌డిఎ, మెప్మా మహిళా సంఘాలకు రుణాలు అందించే పది కోట్ల రూపాయల చెక్కును మంత్రి, అధికారులు విడుదల చేశారు. ప్రశంస పూర్వక సేవలు అందించినందుకు గాను పోలీసు అధికారులు సిబ్బందితోపాటు వివిధ శాఖలకు చెందిన 265 మంది అధికారులు సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందించారు.

మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి. పాటిల్‌, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బాల నరేంద్ర, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమారాజ్‌, బోధన్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అన్నపూర్ణ, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌, డిసిఓ సింహాచలం, జిల్లా పరిషత్‌ సీఈవో గోవింద్‌, జిల్లా ఎంప్లాయ్‌ మెంట్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డ్రగ్స్‌ రాజలక్ష్మి, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్‌ బాబురావు, ఫిషరీష్‌ ఏడి ఆంజనేయ స్వామి, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రమేష్‌, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి శశికళ, మెప్మా పిడి రాములు, ఆర్‌డివోలు రవి, రాజేశ్వర్‌, శ్రీనివాసులు, డిసిఎస్‌ఓ వెంకటేశ్వర్లు, డిఎం సివిల్‌ సప్లయిస్‌ అభిషేక్‌ సింగ్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడి రమేష్‌, అడిషనల్‌ డిఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ సుదర్శనం, తదితరులు ప్రశంసా పత్రాలు అందుకున్న వారిలో ఉన్నారు.

జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విట్టల్‌ రావు, నగర మేయర్‌ నీతూ కిరణ్‌, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌, అర్బన్‌ శాసనసభ్యులు గణేష్‌ గుప్తా, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌, సెవెంత్‌ బెటాలియన్‌ కమాండెంట్‌ సత్య శ్రీనివాస్‌, అడిషనల్‌ డిసిపి ఉషా విశ్వనాథ్‌, డిసిపి అరవింద్‌ బాబు, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, రెడ్కో చైర్మన్‌ అలీమ్‌, తెలంగాణ యూనివర్సిటీ విసి రవీంద్ర గుప్త, జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »