నిజామాబాద్, ఆగష్టు 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం 75 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని 7 వ డివిజన్ లోని చంద్ర నగర్, సూర్య నగర్లో ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ తాహెర్బిన్ హందాన్ హాజరై జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.
కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి జగడం సుమన్, గంగాధర్, మైనార్టీ సిటీ అధ్యక్షుడు అబ్దుల్ ఏజాజ్, నగర జనరల్ సెక్రెటరీ నరేందర్ సింగ్, కాలనీవాసులు నరసయ్య, రాజేందర్, బిక్షపతి, నర్సింగరావు, కనకరాజు, రాధా, శోభన, లక్ష్మి ,అనిత, వసంత, రుక్మిణి, గాయత్రీ విగ్నేష్, చైతన్య, రమ్య, అమూల్య ,లావణ్య, పద్మ, గంగ మణి, లలిత తదితరులు పాల్గొన్నారు.