కామారెడ్డి, ఆగష్టు 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో గల అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ జిల్లా కార్యాలయంలో 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మూడు రంగుల జెండా ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కామారెడ్డి జిల్లా అదనపు ఎస్పి అన్యోన్య హాజరై మాట్లాడారు. ప్రజలందరికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
దాదాపు రెండు వందల సంవత్సరాలపాటు శ్వేత జాతీయుల పాలనలో, పరతంత్ర చెరలో మగ్గిన భరతజాతి ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల అపార త్యాగాల ఫలితంగా బంధవిముక్తమై స్వేచ్చావాయువులు పీల్చింది నేటిరోజే అన్నారు. మనం ఇప్పుడు అనుభవిస్తున్న స్వేఛ్ఛ స్వతంత్రం వారు ఇచ్చినవే అని స్వాతంత్ర సమరయోధులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. సమాచార హక్కు చట్టం 2005 పై ప్రజలకు, అధికారులకు అవగాహన కల్పిస్తూ, స్వఛ్ఛందంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమాచార హక్కు చట్టం ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్, ఛైర్మన్ మొహమ్మద్ షరార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు, రాష్ట్ర కార్యదర్శి దన్నారపు రాజలింగం, జిల్లా మహిళా అధ్యక్షురాలు బట్టు పద్మజా, మహిళా ఉపాధ్యక్షురాలు మోతే లావణ్య, జిల్లా ఉపాధ్యక్షులు బట్టు అనంధ్ కుమార్ రాజ్, ఎంవి. భాస్కర్, జాకీర్ హుస్సేన్, మహమ్మద్ ఆజామ్, అజీజ్, బాలాజీ, బంగారు రమేష్, ప్రతినిధులు ఆంజనేయులు, లక్కాకుల నరేష్, భవాని పేట సుమన్, హనుమాన్లు, నితిన్, డాక్టర్ బాలబ్రహ్మం, డాక్టర్ తాహెర్ హుస్సేన్, రఘురాం, బాలరాజు, పర్వత రావు, రాజేశ్వరరావు, తాజుద్దీన్, మేరాజ్, దావూద్, షారుక్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.