మోర్తాడ్, ఆగష్టు 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్ మండల కేంద్రంలోని గ్రామ సచివాలయంలో కార్యదర్శిగా పనిచేస్తున్న రామకృష్ణ రాష్ట్ర మంత్రి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.
ప్రభుత్వం, ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని పనులు అన్ని ప్రభుత్వ నిబంధనల మేరకు నెరవేరుస్తున్నందుకు గాను రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా 75 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కార్యదర్శి రామకృష్ణకు జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో ఉత్తమ అవార్డు బహూకరించారు.
మోర్తాడ్ గ్రామానికి అవార్డు రావడం పట్ల మోర్తాడ్ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే కార్యదర్శి రామకృష్ణను అభినందించారు.