కామరెడ్డి, ఆగష్టు 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జల బిక్షపతి కామారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ వద్ద ఆదివారం జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ అంచెలంచెలుగా అభివ ృద్ధి చెందుతుందని, స్వాతంత్య్ర ఫలాలు ఇంకా పేదలకు అందవలసి ఉందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా జడ్జి సత్తయ్య, సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రాజ్ కుమార్, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
కోర్టు ఆవరణలో జెండా ఆవిష్కరించిన జిల్లా జడ్జి సత్తయ్య
కామారెడ్డి జిల్లా కోర్టు సముదాయంలో అదనపు జిల్లా జడ్జి బత్తుల సత్తయ్య ఆదివారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బార్ అసోసియేషన్ హాలులో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు అన్ని కులాలకు మతాలకు అతీతంగా భారతదేశానికి ప్రపంచంలో గొప్ప పేరు ఉందని అన్నారు.
సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్, జూనియర్ సివిల్ జడ్జి రాజ్ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జల బిక్షపతి, తదితరులు మాట్లాడారు. వివిధ కోణాలలో సీనియర్ న్యాయవాదులు తమ అభిప్రాయాలు తెలలిపారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.