కామారెడ్డి, ఆగష్టు 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నమస్తే తెలంగాణ తూప్రాన్ రూరల్ రిపోర్టర్ నాగరాజు ఆత్మహత్యకు పాల్పడటం దురదృష్టకరమని, నాగరాజు మృతికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సంతాపం తెలియజేస్తూ అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.
నాగరాజు మృతికి నమస్తే తెలంగాణ యాజమాన్యం వేధింపులు కారణమనే ఆరోపణలు వస్తున్నాయని, నాగరాజు ఆత్మహత్యపై విచారణ జరిపించాలని ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. అదేవిధంగా నాగరాజు కుటుంబానికి నమస్తే తెలంగాణ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించి, అతని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.