నిజామాబాద్, ఆగష్టు 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సీజనల్ వ్యాధులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ప్రజల ఆరోగ్యాలు కాపాడడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో జిల్లా అధికారుల సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, డెంగ్యూ, మలేరియా తదితర సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున వాటి నివారణకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రజలు వ్యాధుల బారిన పడకుండా చూడాలన్నారు. సీజనల్ వ్యాధులు, ఉపకార వేతనాలు, హరితహారం, కోర్టుకు సంబంధించిన నోటీసులు ఉత్తర్వులపై జిల్లా అధికారులు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని నిర్ణీత సమయంలో వాటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మలేరియా, డెంగ్యూ వ్యాధుల పరీక్షలు జిజిహెచ్, పీహెచ్సీలో శాంపిల్ కలెక్షన్ చేసి రిపోర్టులు తీసుకొని అందుకు అనుగుణంగా వ్యాధిగ్రస్తులకు సత్వర చికిత్సలు అందించాలని పేర్కొన్నారు. డోర్ టు డోర్ సర్వే, టెస్టింగ్, ట్రీట్మెంట్లు గవర్నమెంట్ హాస్పిటల్‌లో జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మెడికల్ ఆఫీసర్లను ఆదేశించారు. మెడికల్ ఆఫీసర్లు ఫీల్డ్‌లో వెళ్లాలన్నారు. మున్సిపల్, గ్రామ పంచాయతీలలోనూ యాంటీ లార్వా యాక్టివిటీస్ ఫాగింగ్ మిషన్ ద్వారా త్రీ ఫోర్ డేస్ కంటిన్యూ జరగాలని, పంచాయతీ సెక్రెటరీలు పర్యవేక్షణ చూసుకోవాలన్నారు.
హరితహారం పనులు వచ్చే సోమవారం వరకు క్లోజ్ చేయాలన్నారు. మొక్కలకు వాటర్ మీద ఫోకస్ చేయాలన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలన్నారు. వచ్చే వారం వరకు పూర్తి చేయాలన్నారు. జిల్లా కార్యాలయాల్లో హైకోర్టు, లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ నుంచి వచ్చిన పిటిషన్స్ పెండిరగ్ ఉంటే డిస్పోజ్ చేయాలన్నారు. బీసీ వెల్ఫేర్, ఎస్సి వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్ సంబంధించిన లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఉపకార వేతనాలు పెండిరగ్ ఉండకూడదన్నారు. ఉపకార వేతనాలు సంబంధిత కాలేజ్ యాజమాన్యాలు పర్టికూలర్స్ తొందరగా పంపాలని పంపని వారిపై గట్టిగా యాక్షన్ తీసుకోవాలన్నారు.
కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు చిత్రా మిశ్రా, చంద్రశేఖర్., మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్ , సంబంధిత అధికారులు పాల్గొన్నారు.