డిచ్‌పల్లి, ఆగష్టు 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ పీజీ కళాశాలలోని ఎం.ఎ., ఎం.ఎస్.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్. ఎల్. బి., ఎల్.ఎల్.ఎం., ఇంటిగ్రేటెడ్ కోర్సులకు చెందిన మొదటి సెమిస్టర్స్ రెగ్యూలర్ థియరీ పరీక్షలు ఈ నెల 23 నుంచి 30 వ తేదీ వరకు జరుగవలసి ఉండగా విద్యార్థుల అభ్యర్థన మేరకు ఆ తేదీల్లో ఎడ్‌సెట్ పరీక్ష నిర్వహింపబడుతున్న కారణంగా పరీక్షలను ఈ నెల 26 నుంచి సెప్టెంబర్ 3 వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు రివైస్డ్ – షెడ్యూల్ విడుదల చేశారు. వీటితో పాటుగా ఐఎంబిఎ ఏడవ సెమిస్టర్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలోని బి.ఎడ్. మొదటి సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ పరీక్షలు ఈ నెల 23 నుంచి 28 వ తేదీ వరకుÑ బి.ఎడ్. మూడవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలు ఈ నెల 26 నుంచి 28 వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
పరీక్షలు రాసే విద్యార్థులు పరీక్షా కేంద్రాలలో కొవిద్ – 19 నిబంధనలకు తప్పనిసరిగా పాటించాలన్నారు. మాస్క్ ధరించడం, ఎవరికి వారే శానిటైజర్, వాటర్ బాటిల్ వంటివి వెంట తెచ్చుకోవాలని ఆదేశించారు. పరిసర ప్రాంతాలలో 6 అడుగుల భౌతిక దూరం నియమంతో మెలగాలని సూచించారు. అర్థగంట ముందుగానే పరీక్షాకేంద్రానికి హాజరు కావాలని ఆజ్ఞాపించారు. ఆలస్యమైన విద్యార్థులను ఎట్టి పరిస్థితిలో పరీక్షాకేంద్రంలోకి ప్రవేశం కల్పించబోమని పేర్కొన్నారు.