నందిపేట్, ఆగష్టు 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద స్థానిక ఇంచార్జి ఎస్.ఐ ఆంజనేయులు ఏ.ఎస్సై రాజేందర్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఇందులో పాత బకాయి చలాన్లు ఉన్న వాహనదారులకు ఆన్‌లైన్‌లో చెక్ చేసి చలాన్లు మీ సేవలో చెల్లించాల్సిందిగా సూచించారు.
మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని బ్రీత్ అనలైజర్ పరికరం ద్వారా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ ఆంజనేయులు మాట్లాడుతూ పాత బకాయిలు ఉన్నవారు తమ బకాయిలను మీ సేవ కేంద్రాలలో చెల్లించాలని, లేనిచో పోలీసు తనిఖీల్లో బకాయిలు ఉన్న వాహనదారులు పట్టుబడితే వారి వాహనాలు జప్తు చేయడమే కాకుండా, వారి వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించి చట్టపరమైన చర్యలు చేపడతామని అన్నారు.
మద్యం సేవించి వాహనాలు నడప రాదని, ఒకవేళ మద్యం సేవించి వాహనాలు నడిపేవారు తనిఖీల్లో చిక్కినట్టైతే అలాంటి వాహనదారులపై కేసులు నమోదు చేసి వారిపై చట్టరీత్యా చర్యలు చేపడతామని అన్నారు.