ఆర్మూర్, ఆగష్టు 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా కిసాన్ మోర్చ ఆర్మూర్ పట్టణ, ఆర్మూరు మండల శాఖల ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం ముందు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా భారతీయ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, ఆర్మూర్ పట్టణ, ఆర్మూరు మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు పాలెపు రాజ్ కుమార్, లోక నర్సారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తెలంగాణలో ఉన్నటువంటి రైతులను బంగారు రైతులుగా మారుస్తామని చెప్పి రైతు కష్టం తన కష్టంగా భావిస్తానని చెప్పి మాయమాటలు చెప్తూ రైతులకు ఎటువంటి సహాయ సహకారం అందించకుండా ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ రైతులనే కాదు తెలంగాణ ప్రజలు సైతం మోసం చేస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు.
దగుల్బాజీగా మారి మోసపుచ్చుతూ రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ వెంటనే ఇస్తానని చెప్పి చేయకపోవడం రైతులను మోసం చేయడమేనని, అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తెలంగాణలో అమలు చేయకుండా తెలంగాణలో ఉన్న రైతులకు అన్యాయం చేస్తున్నారని, యూరియా ఉచితంగా ఇస్తాననిచెప్పి రైతులను మోసం చేస్తున్నారని అన్నారు.
కార్యక్రమంలో ఆర్మూర్ బిజెపి పట్టణ అధ్యక్షులు, ఆర్మూర్ మండల అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్, రోహిత్ రెడ్డి, కిసాన్ మోర్చా ఆర్మూరు పట్టణ, మండల ప్రధాన కార్యదర్శులు దొర్ల నారాయణ, రాజారెడ్డి, ఉపాధ్యక్షులు పున్నం రాజేందర్, శేషగిరి లింగం, చిట్టి భజన్న, గోవింద్ పేట్ ఎంపీటీసీ రాజ్ కుమార్, ఆర్మూరు పట్టణ, ఆర్మూరు మండల బీజేవైఎం అధ్యక్షులు కలిగోట ప్రశాంత్, నరేష్ చారి, పట్టణ ప్రధాన కార్యదర్శులు ఉదయ్ గౌడ్, పసుపుల సాయికుమార్, పట్టణ ఉపాధ్యక్షులు భరత్, పెరంబదూర్ వాసు, గిరిజన మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు కేలోత్ పీర్ సింగ్, భూపేందర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.