కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డిలోని దేవున్‌పల్లి పాత కలెక్టర్ కార్యాలయం, గోదాం వద్ద అగి ఉన్న లారీని కార్ ఢీకొనగా ప్రమాదం జరిగింది. కాగా ఒకరు మృత్యువాత పడగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది స్థానిక పోలీసులు కారులో ఇరుక్కున్న క్షతగాత్రులను అతి కష్టం మీద బయటకు తీశారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అందరు కామరెడ్డికి చెందిన యువకులుగా …
Read More »Daily Archives: August 17, 2021
అత్యవసర సమయంలో యువకుని రక్తదానం
కామరెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రామరెడ్డి మండలం కన్నపూర్ గ్రామానికి చెందిన వినోద (32) కు ఆపరేషన్ నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్‌లో బి పాజిటివ్ రక్తం అవసరం ఏర్పడిరది. కామారెడ్డి బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి, కామారెడ్డి రక్తదాతల గ్రూప్ నిర్వాహకులు ఎనుగందుల నవీన్ ను సంప్రదించగా కామారెడ్డి పట్టణానికి చెందిన యువకుడు అశోక్ కుమార్‌ను ఫోన్‌లో సంప్రదించారు. మానవతా దృక్పథంతో …
Read More »మెడికల్ క్యాంపులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 15 రోజులలో 13 మెడికల్ క్యాంపులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుండి సీజనల్ వ్యాధులు, హరితహారం, ఫారెస్ట్ రిజనరేషన్‌పై మున్సిపల్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డెంగ్యు కేసులు ఐడెంటిఫై అయిన గ్రామాలలో ఆ ఇంటికి చుట్టు …
Read More »ఉత్తమ సిసి అవార్డు అందుకున్న శ్రీనివాస్
మోర్తాడ్, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్ మండల కేంద్రంలోని డిఆర్‌డిఏ ఐకెపిలో ధర్మోర సీసీగా పనిచేస్తున్న తడకల శ్రీనివాస్ 75 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం నిజామాబాద్ జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ సిసి అవార్డును అందుకున్నారు. అంతాపూర్ గ్రామానికి చెందిన తడకల శ్రీనివాస్ గతంలో 2014 సంవత్సరంలో మొదటిసారి ఉత్తమ …
Read More »జిల్లా పరిషత్‌లో ముఖ్య శాఖలపై చర్చ
నిజామాబాద్, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం సందర్భంగా ముఖ్యమైన శాఖలపై సభ్యులు చర్చించారు. మంగళవారం జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రా, సీఈవో గోవిందు, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఆర్‌డిఎ, వ్యవసాయం, వైద్య …
Read More »దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా విజయవంతం చేయండి…
కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, మాజీ ప్రతిపక్ష నాయకులు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదేశాల మేరకు మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు అధ్యక్షతన, కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్, పీసీసీ కార్యదర్శి మహమ్మద్ మసూద్ హైమద్ ముఖ్య అతిథిగా పాల్గొని బుధవారం …
Read More »శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు
నిజామాబాద్, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కార్తికేయ వెల్లడిరచారు. శాంతి భద్రతల వరిరక్షణ కొరకై పోలీస్ శాఖ ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటుందని, నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే అటువంటి వారిపై, సమాజంలో రౌడి యాక్టివిటిస్ గలవారిపై, …
Read More »ఆర్మూర్‌లో ఘనంగా జెండా ఉత్సవాలు…
ఆర్మూర్, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని వెంకటేశ్వర ఆలయంలో బుధవారం నుండి జెండా జాతర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. జాతరకు ఆర్మూర్ పరిసరాల ప్రాంతాల్లోని భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ కేంద్రంగా పాలన సాగించిన దొరలు జెండా పండుగ ప్రారంభించినట్లు ప్రతీతి. అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని ప్రస్తుతం ఆర్మూర్ సర్వ సమాజ సభ్యులు కొనసాగిస్తున్నారు. జెండా …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్
డిచ్‌పల్లి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో మంగళవారం కూడా డిగ్రీ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10:00-12:00 గంటల వరకు డిగ్రీ ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ పరీక్షలకు మొత్తం 3 వేల 564 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 3 వేల 370 …
Read More »29న రాష్ట్ర సదస్సు
బోధన్, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 29 న మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లోని సుమంగలి పంక్షన్ హాల్‌లో జరిగే ఇఫ్టూ రాష్ట్ర సదస్సుకు ఐ.ఎఫ్.టీ.యూకు చెందిన శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బి. మల్లేష్ పిలుపునిచ్చారు. మంగళవారం బోధన్ పట్టణంలో ఇఫ్టూ రాష్ట్ర సదస్సుకు సంబంధించిన గోడ ప్రతులు ఆవిష్కరించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని, నాలుగు లేబర్ …
Read More »