బోధన్, ఆగష్టు 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 29 న మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లోని సుమంగలి పంక్షన్ హాల్‌లో జరిగే ఇఫ్టూ రాష్ట్ర సదస్సుకు ఐ.ఎఫ్.టీ.యూకు చెందిన శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బి. మల్లేష్ పిలుపునిచ్చారు.
మంగళవారం బోధన్ పట్టణంలో ఇఫ్టూ రాష్ట్ర సదస్సుకు సంబంధించిన గోడ ప్రతులు ఆవిష్కరించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని, నాలుగు లేబర్ కోడ్స్ అమలు నిలిపివేయాలని, కాంట్రాక్ట్ వర్కర్స్ రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతన సాధనకై సదస్సులో నిర్ణయాలు చేసి పోరాడుతామని బి మల్లేష్ అన్నారు.
సదస్సు రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ అధ్యక్షత వహిస్తారని, ముఖ్యఅతిథి జాతీయ ప్రధాన కార్యదర్శి బి ప్రదీప్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సూర్యం, రాష్ట్ర నాయకులు ప్రసంగిస్తారని తెలిపారు.