మెడికల్‌ క్యాంపులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, ఆగష్టు 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 15 రోజులలో 13 మెడికల్‌ క్యాంపులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుండి సీజనల్‌ వ్యాధులు, హరితహారం, ఫారెస్ట్‌ రిజనరేషన్‌పై మున్సిపల్‌, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ డెంగ్యు కేసులు ఐడెంటిఫై అయిన గ్రామాలలో ఆ ఇంటికి చుట్టు పక్కల వున్న 100 ఇళ్లను ఫీవర్‌ సర్వే నిర్వహించాలని మెడికల్‌ అధికారులను ఆదేశించారు.

గత సంవత్సరం మొత్తం 58 కేసులు నమోదు కాగా ఇప్పుడు 38 డెంగ్యు కేసులు గుర్తించామన్నారు. రేపటి నుండి కేసులు పెరగకుండా ఫీవర్‌ సర్వే నిర్వహిస్తూ టెస్టులకు శాంపిల్స్‌ స్వీకరించి జిజిహెచ్‌కు పంపాలని డ్రైవ్‌ నిర్వహించాలని ప్రతి మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలలో నీరు నిలువకుండా గ్రావెల్‌ వేయించాలని వాటర్‌ డ్రెయిన్‌ అవుట్‌ చేయించాలని మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలో రేపటి నుంచి యాంటీ లార్వా, ఆయిల్‌ బాల్స్‌ వదలాలని వారం రోజులు పాటు పకింగ్‌ స్ప్రేయింగ్‌ వీటితో పాటు తాగునీరు లీకేజీ ట్యాంక్‌ దగ్గర నల్ల దగ్గర పరిశీలించాలన్నారు.

తాగే నీరు క్లోరినేషన్‌ జరగాలన్నారు. గట్టిగా పని చేయాలన్నారు. రోజు వారీగా రిపోర్టు ఇవ్వాలన్నారు. ఎంపీడీవో మున్సిపల్‌ అధికారులు వారం రోజులు నిర్వహించాలన్నారు. మెడికల్‌ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ అధికారులు రోజు పరిశీలించాలన్నారు. శానిటేషన్‌ పరంగా పరిశీలించాలన్నారు. రేపటినుండి డెంగ్యు కేసులు అనే మాట వినిపించకుండా చూడాలని అన్నారు. 15 రోజుల్లో మెడికల్‌ అధికారి 13 మెడికల్‌ క్యాంపులు నిర్వహించే విధంగా మెడికల్‌ ఆఫీసర్‌ చర్యలు తీసుకోవాలన్నారు.

క్యాంపు శిబిరం నుండి అవగాహన కల్పించాలన్నారు. రెగ్యులర్‌ వర్క్‌తో పాటు చేయాలన్నారు. మెడికల్‌ ఆఫీసర్‌లు రోజు ఫీల్డ్‌లో ఉండాలన్నారు. యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేసుకోవాలని టెస్టింగ్‌లు ప్రాపర్‌గా జరగాలని తెలిపారు. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ రోజు 10 వేలు జరగాలని టార్గెట్‌ జిల్లా కార్యదర్శి క్రాస్‌ కావాలన్నారు. మెడికల్‌ క్యాంపులు కోవిడ్‌ పరీక్షలు నిర్వహించాలన్నారు. హరితహారం శనివారం వరకు 100 శాతం పూర్తి కావాలని అన్నారు.

బృహత్‌ పల్లె ప్రకృతి వనం తొందరగా పూర్తి చేయాలన్నారు. హరితహారం అయిన చోట ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. బృహత్‌ పల్లె ప్రకృతి వనానికి నాలుగు వైపులు ఎమ్మార్వోలు తొందరగా గుర్తించాలని తెలిపారు. ఫారెస్ట్‌ రీ జనరేషన్‌ బ్లాక్‌ వారిగా పనులు గుర్తించి ఎస్టిమేషన్సు పంపాలన్నారు. ఇందల్వాయి సిరికొండ పనులు గుర్తించే ఎస్టిమేషన్‌ పంపినందుకు గుడ్‌ వర్క్‌ అని తెలిపారు.

ఫారెస్ట్‌ రీ జనరేషన్‌ వర్క్స్‌ ఎఫ్‌ఆర్‌వో, ఎంపీడీవోలు కోఆర్డినేషన్‌తో వర్క్‌ జరిగే విధంగా ఎల్లుండి వరకు ప్రారంభించాలని అన్నారు. 20 మందితో 189 గ్రామ పంచాయతీలలో వర్క్‌ జరిగే విధంగా రేపు ప్లాన్‌ చేసుకోవాలని క్వాలిటీ వర్క్‌ జరగాలని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, అడిషనల్‌ కలెక్టర్లు చిత్ర మిశ్రా, చంద్రశేఖర్‌, డిఆర్‌డిఓ చందర్‌ నాయక్‌, డిఎం హెచ్‌ఓ ఇంచార్జ్‌ సుదర్శనం, డిపిఓ జయసుధ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »