నిజామాబాద్, ఆగష్టు 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కార్తికేయ వెల్లడిరచారు.
శాంతి భద్రతల వరిరక్షణ కొరకై పోలీస్ శాఖ ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటుందని, నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే అటువంటి వారిపై, సమాజంలో రౌడి యాక్టివిటిస్ గలవారిపై, ఆయుదాలు వాడే వారిపై, అమ్మాయిలను ఏడిపించే వారిపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
కావున సమాజంలో ఇటువంటి వారు వారి పద్దతి మార్చుకోవాలని , లేని యెడల వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎవ్వరికైనా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిచించడం లేదా సమాజంలో ఉద్రిక్తతలను రేపే విధంగా వ్యవహారించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పోలీస్ శాఖాపరంగా శాంతియుత వాతావారణం కొరకై నిర్విరామంగా కృషి జరుగుతుందని, ప్రజల సహాకారం అత్యంత ప్రధానమైనదని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిపించే వారి సమాచారం తెలిసిన మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని లేదా దిగువ తెలియజేసిన ఫోన్ నెంబర్లకు తెలియజేయాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు.
సి.పి క్యాంప్ కార్యాలయం నెంబర్ : 08462 – 221750
స్పెషల్ బ్రాంచ్ నెంబర్ : 9490618000
పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ : 08462-226090
స్పెషల్ బ్రాంచ్ ఇన్స్‌పెక్టర్ నెంబర్ : 9440795452
సి.సి.ఆర్.వి ఇన్స్‌పెక్టర్ నెంబర్ : 9440795472
సెల్ నెంబర్ 9491398540 లకు నమాచారం ఇవ్వవచ్చన్నారు.