కామరెడ్డి, ఆగష్టు 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రామరెడ్డి మండలం కన్నపూర్ గ్రామానికి చెందిన వినోద (32) కు ఆపరేషన్ నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్లో బి పాజిటివ్ రక్తం అవసరం ఏర్పడిరది. కామారెడ్డి బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి, కామారెడ్డి రక్తదాతల గ్రూప్ నిర్వాహకులు ఎనుగందుల నవీన్ ను సంప్రదించగా కామారెడ్డి పట్టణానికి చెందిన యువకుడు అశోక్ కుమార్ను ఫోన్లో సంప్రదించారు.
మానవతా దృక్పథంతో మంగళవారం సాయంత్రం వర్షం సైతం లెక్క చేయక ముందుకు వచ్చి రక్తదానం చేశాడు. రక్తదాత అశోక్ కుమార్ను అభినందించారు.
కార్యక్రమంలో బిజెవైఎం పట్టణ అధ్యక్షులు నంది వేణు, కుటుంబ సభ్యులు నర్సింలు, శంకర్, వీటి ఠాగూర్ రక్తనిధి కేంద్రం నిర్వాహకులు చందన్ తదితరులు పాల్గొన్నారు.