కామారెడ్డి, ఆగష్టు 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన హరిలత అనే యువతి రక్తలేమితో చికిత్స పొందుతూ ఏబి పాజిటివ్ రక్తం అవసరం ఉందని వారి కుటుంబ సభ్యులు కామారెడ్డి జిల్లా రక్తదాతల గ్రూప్ నిర్వాహకులు ఎనుగందుల నవీన్‌ను సంప్రదించారు.
కాగా కామారెడ్డి జిల్లా లింగంపేట్‌కు చెందిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు జిల్లా శారీరక్ ప్రముక్ బాజ ప్రసాద్ స్వచ్చందంగా వర్షంలో 30 కిలోమీటర్ల దూరం నుండి వచ్చి రక్తదానం చేశారు. 6వ సారి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటారు.
ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కరోన సమయంలో ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహించారు. వారి సేవ దృక్పథాన్ని కామారెడ్డి జిల్లా రక్తదాతల గ్రూప్ తరుపున కృతజ్ఞతలు తెలిపారు. రక్తదాన కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా రక్తదాతల గ్రూప్ నిర్వాహకులు, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఎనుగందుల నవీన్, రాయిపల్లి సంతోష్ రెడ్డి, వీటి ఠాగూర్ రక్తనిధి కేంద్రం టెక్నిషన్ చందన్ తదితరులు పాల్గొన్నారు.