నిజామాబాద్, ఆగష్టు 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని కష్టపడితే మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి శిక్షణ పొందే యువతకు ఉద్బోధించారు.
బుధవారం డిచ్‌పల్లి మండల కేంద్రం టీటీడీసీ శిక్షణ కేంద్రంలో సందర్శించి డిఆర్‌డిఎ ఆధ్వర్యంలో జరుగుతున్న దిన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం క్రింద 2018-2019 సంవత్సరంలో ఉపాధి హామీలో వందరోజులు పనీ పూర్తిచేసిన కుటుంబాలలోని నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయగా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై యువతను ఉద్దేశించి మాట్లాడారు.
శిక్షణ 90 రోజులు నిర్వహించడం జరుగుతుందని శిక్షణ సందర్భంగా పర్సనాలిటీ డెవలప్‌మెంట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సింపుల్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో వారికి వివరించారు. శిక్షణానంతరం ఉద్యోగం గురించి కూడా వివరించారు. చేయగలుగుతామనే నమ్మకం, నేర్చుకునే స్వభావం హార్డ్ వర్క్ ఇక్కడ చెప్పే విషయాలపై ఫోకస్ చేయడం తదితర విషయాలపై శిక్షణ పొందే వారు మనసు పెట్టాలన్నారు. మాట్లాడే విధానం గురించి ఇక్కడే ప్రాక్టీస్ కావాలన్నారు. అనంతరం మొక్కలను నాటారు. టిటిడిసి కేంద్రంలో ప్రకృతి వనంగా మార్చాలని సూచించారు. యూనిఫామ్స్ అందించారు
అంతకుముందు స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఇస్తున్న హౌస్ వైరింగ్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. 30 రోజుల శిక్షణ కార్యక్రమంలో పది రోజులు పూర్తి చేసుకోగా కలెక్టర్ మాట్లాడుతూ మొదట కావాల్సింది కమిట్మెంట్ అన్నారు. కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్ చాలా ముందుకు వెళ్తున్నదని మీరు నేర్చుకునే పని నిర్మాణ రంగంలో అవసరం ఉంటుంది దానితో పాటుగా కొన్ని విలువలు పాటించాలని మొదటిది కస్టమర్ కేర్‌కు ప్రయారిటీ ఇవ్వాలని, క్వాలిటీ వర్క్ చేయాలని కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకుంటూ ఉండాలని కస్టమర్ యొక్క ఇంట్రెస్ట్ ప్రొడక్ట్ చేయాలని కస్టమర్ నమ్మకం పోగొట్టకుండా ఆయనకు కావలసిన క్వాలిటీ ఇవ్వాలని టైం లిమిట్స్ చాలా ముఖ్యమని మాట, మంచిగా పని చేయడం వల్ల పబ్లిసిటీ అవుతుందన్నారు.
కస్టమర్‌ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించరాదు అన్నారు. క్వాలిఫికేషన్ కన్నా ముఖ్యమైంది కష్టపడే తత్వం అన్నారు. కార్యక్రమంలో డిఆర్‌డిఓ చందర్, అడిషనల్ డిఆర్‌డిఓ మధుసూదన్, జాబ్ డిస్ట్రిక్ట్ మేనేజర్, ఆర్‌టిసి డైరెక్టర్ సుధీంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.