కామారెడ్డి జిల్లాను మరువలేను

కామారెడ్డి, ఆగష్టు 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాను జీవితంలో ఎప్పుడూ మరువలేనని ఇక్కడి న్యాయవాదుల ఆత్మీయత మాటల్లో చెప్పలేనని హైదరాబాదుకుకు బదిలీపై వెళ్తున్న కామారెడ్డి అదనపు జిల్లా జడ్జి సత్తయ్య అన్నారు. మంగళవారం రాత్రి కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ హాలులో ఆత్మీయ సమావేశం జరిగింది. కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బత్తుల సత్తయ్య మాట్లాడారు.

నాలుగు సంవత్సరాలు న్యాయవాదులు, అధికారులు చూపిన ఆత్మీయత మరువ లేనిదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉందని ఇంత చక్కటి బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులను విడిచి వెళ్లడం బాధగా ఉందన్నారు. అయినా ఎప్పటికైనా ఏ ఉద్యోగి అయినా బదిలీ తప్పదని తెలిపారు. సమావేశానికి అధ్యక్షత వహించిన బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గజ్జల బిక్షపతి మాట్లాడుతూ జిల్లా జడ్జిగా నాలుగు సంవత్సరాలుగా పనిచేసిన బత్తుల సత్తయ్య మంచి తీర్పులు ఇచ్చారని తన తీర్పులలో ఉత్తమ పదాలను ఉపయోగించి సీనియర్‌ న్యాయవాదులను, జూనియర్‌ న్యాయవాదులను, మెప్పించారన్నారు.

ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సత్తయ్యకు శాలువా జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సీనియర్‌ న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొని సత్తయ్యను ప్రత్యేకంగా సన్మానించారు. కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాస్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జి రాజ కుమారులు మాట్లాడారు. సీనియర్‌ న్యాయవాదులు జగన్నాథం, రామచంద్రారెడ్డి, శంకర్‌ రెడ్డి, వెంకటరామ్‌ రెడ్డి, అన్వర్‌ షరీఫ్‌, పీపీ నంద రమేష్‌, లక్ష్మణరావు, శ్యామ్‌ గోపాల్‌ రావు, రాజ గోపాల్‌, దామోదర్‌ రెడ్డి అమృత రావు, దేవరాజ్‌ గౌడ్‌, చింతల గోపి, శ్రీకాంత్‌ గౌడ్‌, గంగాధర్‌, మసూద్‌ హైమద్‌, సూర్య ప్రసాద్‌, రమేష్‌ చంద్‌, లతా రెడ్డి, షబానా బేగం, చంద్రశేఖర్‌, నరసింహారెడ్డి, జూనియర్‌ వాదులు, కోర్టు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »