కామారెడ్డి, ఆగష్టు 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భిక్కనూరు మండలం కచాపూర్ గ్రామానికి చెందిన రామాగౌడ్ (76) వృద్ధుడికి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) హైదరాబాద్లో ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు.
కాగా వారికి కావాల్సిన రెండు యూనిట్ల రక్తాన్ని హైదరాబాద్ బ్లడ్ డోనర్స్ నిర్వాహకుడు బాల ప్రసాద్ సహకారముతో దోమకొండకు చెందిన సనత్ కుమార్ శర్మ, హైదరాబాద్కు చెందిన బొల్లం భూమేష్ సకాలంలో స్పందించి రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు.
60వ సారి రక్తదానం చేసిన సనత్ కుమార్ శర్మకు కామారెడ్డి రక్తదాతల సమూహము తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అన్నిదానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తం అందించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని తెలిపారు.