వేల్పూర్, ఆగష్టు 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చిన్న పిల్లల కొరకు పి,సి,వి టీకా ప్రారంభించినట్టు వేల్పూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ అశోక్ చెప్పారు.
వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో సబ్ సెంటర్‌లో రొటీన్ ఇమ్యునైజేషన్‌లో భాగంగా చిన్న పిల్లలకొరకు డాక్టర్ అశోక్ ఆధ్వర్యంలో పలు ఆరోగ్య చికిత్స కార్యక్రమాలు నిర్వహించినారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ మాట్లాడుతూ బిసిజి టీకాతో పాటు నూతనంగా తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పిల్లలకు టీకాలు పి సీ.వి టీకా ఇవ్వడం జరుగుతుందని ఇది ప్రారంభించడం శుభ పరిణామమని ప్రజలందరూ గుర్తించాలన్నారు.
ప్రతి బుధవారం పిల్లలకు వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందని. పి. సి.వి టీకా వల్ల పిల్లలకు నిమ్ము వంటివి రాకుండా ఉంటుందని అలాగే కలెక్టర్ ఆదేశాల ప్రకారంగా డెంగు సర్వే నిర్వహించడం జరుగుతుందని 15 రోజుల వరకు సీజనల్ వ్యాధుల సర్వే జరుగుతుందని ముఖ్యంగా చిన్న పిల్లలకు దోమతెర వాడటం వలన డెంగ్యూ చికెన్ గున్యా వ్యాధులు సోకకుండా ఉంటుందని చెప్పారు.
గురువారం నుండి హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇంటి చుట్టూ మురికి నీరు చేరకుండా చూసుకోవాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ నాగమణి, వనమాల, ఆరోగ్య కార్యకర్తలు సమంత, రాధిక, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.