నిజామాబాద్, ఆగష్టు 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర వ్రభుత్వం జాతీయ స్థాయిలో ‘సైబర్ నేరాలు, సైబర్ ఫైనాన్షియల్ నేరాల గురించి 155260 టోల్ ఫ్రీ నెంబర్‌ను వ్రవేశపెట్టారని, భాదితులు డబ్బులు పోయిన వెంటనే ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కార్తీకేయా తెలిపారు.
సాంకేతిక వినియోగం ఎక్కువ కావడం వల్ల సైబర్ నేరాల సంఖ్య అదే స్థాయిలో పెరిగి పోయిందని, సైబర్ నేరాలకు చెక్ పెట్టడం, ప్రజలకు సమర్ధవంతంగా సేవలందించడం లక్ష్యంగా పని చేయడం జరుగుతుందని, సాంకేతిక పద్ధతులకు తగ్గట్టుగా దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ క్రైమ్ యూనిట్ల యొక్క అవశ్యకత చాలా ఉన్నదని, ఇందుకోనమే పోలీస్‌శాఖ వ్రత్యేకంగా కార్యాచరణ రూపొందించి డయల్ 100 ద్వారా కూడా సైబర్ నేరాల ఫిర్యాదులను స్వీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో 155260 నెంబర్ వ్రవేశపెట్టిందని, దీని ద్వారా కూడా సైబర్ క్రైమ్ రిపోర్ట్ చేయవచ్చని, వ్రధానంగా భాదితులు డబ్బులు పోయిన వెంటనే ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలని, మోసవూరిత లావాదేవీలు జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే వాటిని తక్షణం నిలిపి వేసి సంబంధిత వారి యొక్క ఖాతాను ఫ్రీజు చేసే విధంగా చూడవచ్చని, సైబర్ నేరాల కేసుల్లో పూర్తి స్థాయి ఆధారాలను సేకరించి నేరస్థులను గుర్తించడం జరుగుతుందని, వారికి శిక్ష వడేలా చేయడం తద్వారా భాధితులకు న్యాయం చేయడం జరుగుతుందని సిపి అన్నారు.