నిజామాబాద్, ఆగష్టు 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తున్న ఆక్సిజన్ ప్లాంట్ పనులను పరిశీలించారు. గురువారం స్థానిక ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌ను సందర్శించారు. హాస్పిటల్లో ఏర్పాటు చేస్తున్న ఆక్సిజన్ ప్లాంట్‌ను పరిశీలించారు. ఇంకా మిగిలిన పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
విద్యుత్తుకు సంబంధించిన పనులు, కనెక్షన్, మిగతా పూర్తికాని పనులు కూడా మరింత వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. కలెక్టర్ వెంట హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్, డాక్టర్లు, వెంకట్, సరస్వతి, బాల్ రాజు, డిఈ చంద్రశేఖర్, ఏఈ ప్రవీణ్, విద్యుత్ శాఖ డిఈ వెంకటరమణ, ఏడిఈ తోట రాజశేఖర్, నేషనల్ హైవే అధికారులు పాల్గొన్నారు.