కామారెడ్డి, ఆగష్టు 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన జయ వైద్యశాలలో సుశీల (65) పేషెంట్ కి ఏ పాజిటివ్ ప్లేట్ లేట్స్ కావాలని వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. దీంతో కామారెడ్డికి చెందిన నాగరాజు మానవత దృక్పథంతో ఏ పాజిటివ్ ప్లేట్ లెట్స్‌ను నిజామాబాద్ వెళ్లి ఆయుష్ బ్లడ్ బ్యాంక్‌లో అందజేసి ప్రాణాలు కాపాడారు. నాగరాజును అభినందించారు.
కరోనా సమయంలో కూడా 4 యూనిట్ల ప్లాస్మాను అందించిన నాగరాజు నేటి సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని దాతలు ముందుకు వచ్చి ప్లేట్ లెట్స్ అందజేయడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.