నిజామాబాద్, ఆగష్టు 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు సెఫ్టీ గురించి ట్రాఫిక్ పోలీసు అధికారులతో గురువారం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కార్తికేయ నమావేశం నిర్వహించారు.
ఈ సందర్చంగా రోడ్డు సేప్టీకి సంబంధించిన పలు అంశాలు చర్చించారు. రోడ్డు డివైడర్‌ల గురించి, ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి, ప్రధానంగా ఎక్కువగా ప్రమాదాలు జరిగే స్థలాలు గుర్తించాలని అధికారులకు సూచించారు.
అలాగే రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తీసుకోవలసిన నిబంధనలు, ప్రతీ ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వాహనదారులు తప్పకుండా వాహనానికి సంబంధించిన డాక్యూమెంట్లు దగ్గర ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వాహనాల తనిఖీ సందర్భంగా డాక్యుమెంట్లు క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు.
సమావేశంలో అదనపు డి.సి.పి జి. శ్రీనివాస్ కుమార్, ట్రాఫిక్ ఎ.సి.పి ఆర్.ప్రభాకర్ రావు, ట్రాఫిక్ సిఐ చందర్ రాథోడ్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్‌పెక్టర్ ప్రసాద్, సిసిఆర్‌బి ఇన్స్‌పెక్టర్ రాజేశ్వర్, ఐటి కోర్ ఎస్,ఐ ఆసిఫ్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.