పడగల్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం

వేల్పూర్‌, ఆగష్టు 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం పడగల్‌ గ్రామంలో లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో కంటి చూపు పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్‌ రాజు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో గ్రామంలో కంటి వైద్య శిబిరం నిర్వహించామని, 11 మందికి మోతి బిందు ఉన్నట్లు గుర్తించినట్టు తెలిపారు.

అవసరమున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ వర్షిని మాట్లాడుతూ లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో గ్రామస్తులకు ఉచిత వైద్య పరీక్షలు చేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ యాల్లశ్రీనివాస్‌, పాలకవర్గం సభ్యులు, లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

డిగ్రీ పరీక్షలు ప్రారంభం

Print 🖨 PDF 📄 eBook 📱 డిచ్‌పల్లి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »