ఆర్మూర్, ఆగష్టు 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమల నివారణకు చర్యలు చేపట్టాలని, సీజనల్ వ్యాధులు ప్రభలకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే, పియుసి చైర్మన్ జీవన్ రెడ్డి, రాజేశ్వర్ ఆదేశానుసారం గురువారం ఆర్మూర్ పట్టణంలోని 1వ వార్డు 2 వ వార్డు పరిధిలోని జిరాయత్ నగర్, సంతోష్ నగర్‌లలో ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పించారు.
ఆరోగ్య శాఖా మున్సిపల్ శాఖ సంయుక్తంగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో మున్సిపల్ కౌన్సిలర్, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు సంగీతా ఖాందేష్, 1 వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ రెహమాన్‌తో పాటు, అర్బన్ ఆరోగ్య శాఖా సూపరింటెండ్ అయేషా, అర్బన్ హెల్త్ సెంటర్ సూపర్ వైజర్ చంద్ర శేఖర్, సానిటరీ అధికారి మహేష్, పట్టణ మిషన్ సమన్వయకర్త ఉదయశ్రీ పాల్గొని ఇంటి ఆవరణలో నీళ్లు నిలువకుండా తగు చర్యలు తీసుకుంటే డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు అని తెలిపారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశములో కౌన్సిలర్లు సంగీతా ఖాందేష్, అబ్దుల్ రహమాన్ మాట్లాడుతూ ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుపుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.
ఆరోగ్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది చేపట్టాల్సిన చర్యల గురించి తెలిపారు. వైద్య సిబ్బంది అనారోగ్యముతో వున్నవారిని పరీక్షించి తగిన మందులు ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో నాయకులు ఖాందేష్ సత్యం, మున్సిపల్ సిబ్బంది రాజ లింగం, శంకర్, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, స్వప్న, బాలాజీ, అంగన్ వాడి టీచర్లు శోభ, సవిత, కవిత, అరుంధతి, సరిత తదితరులు పాల్గొన్నారు.