కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణం వీక్లిమార్కెట్‌లోని శ్రీ రాజరాజేశ్వరి మాత ఆలయ 5వ వార్షికోత్సవం వేడుకలను శుక్రవారం కామారెడ్డి పట్టణ మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు ఇంటింటా కలశాలను తీసుకుని ఊరేగింపు నిర్వహించారు. పాత హనుమాన్ ఆలయం నుంచి ఊరేగింపు ప్రారంభించి పెద్దబజార్, స్టేషన్ రోడ్, సుభాష్ రోడ్, జేపీఎన్ రోడ్, మాయాబజార్‌ల మీదుగా కొనసాగింది. …
Read More »Daily Archives: August 20, 2021
భక్తి శ్రద్దలతో వరలక్ష్మి వ్రతం…
వేల్పూర్, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలోని ఆలయాలలో శుక్రవారం మహిళలు అత్యంత భక్తి శ్రద్దలతో వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మి దేవిని కొలుస్తారని శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తుందని, సకల ఐశ్వర్యాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో కలుగుతాయని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. కుటుంబసభ్యుల క్షేమం కోసం …
Read More »దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు నడిపిన మహనీయుడు రాజీవ్ గాంధీ
నిజామాబాద్, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి జగడం సుమన్, నిజామాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చక్రి దత్తాత్రితో కలిసి నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, గర్భిణీలకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వరదబట్టు వేణురాజ్ మాట్లాడుతూ రాజీవ్ …
Read More »పీఆర్సీ కోల్పోయిన పెన్షనర్స్ సమావేశం
ఆర్మూర్, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని సీవీఆర్ కళాశాలలో శుక్రవారం తెలంగాణ అల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆర్మూర్ డివిజన్ సర్వసభ్య సమావేశాన్ని బాబాగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా దత్తాత్రేయ, రామ్మోహన్ రావు, ఈవీఎన్ నారాయణ, ముత్తారం నరసింహ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1-07-2018 నుండి పదవీ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీ …
Read More »ఐటి రంగాన్ని అభివృద్ది చేసిన ఘనత రాజీవ్‌దే…
కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని కామారెడ్డి పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం నిజాంసాగర్ చౌరస్తాలో గల రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస శ్రీనివాసరావు మాట్లాడుతూ మనదేశంలో ఐటీ రంగం ఇంత అభివృద్ధి చెందడానికి కారణం …
Read More »శనివారం విద్యుత్ అంతరాయం…
నిజామాబాద్, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం 21వ తేదీన నిజామాబాద్ పట్టణంలోని అన్ని విద్యుత్ ఉప కేంద్రాల్లో పవర్ హౌస్, తిలక్‌గార్డెన్, వినాయక నగర్, బోర్గాం, దుబ్బ, సుభాష్ నగర్, అర్సపల్లి, గూపన్ పల్లి, మిర్చి కాంపౌండ్, న్యూ హౌసింగ్ బోర్డు, ముబారక్ నగర్ విద్యుత్ కేంద్రాల్లో నెల వారి మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఎడిఈ, టౌన్1 ఏం అశోక్, …
Read More »