కామారెడ్డి, ఆగష్టు 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణం వీక్లిమార్కెట్లోని శ్రీ రాజరాజేశ్వరి మాత ఆలయ 5వ వార్షికోత్సవం వేడుకలను శుక్రవారం కామారెడ్డి పట్టణ మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు ఇంటింటా కలశాలను తీసుకుని ఊరేగింపు నిర్వహించారు. పాత హనుమాన్ ఆలయం నుంచి ఊరేగింపు ప్రారంభించి పెద్దబజార్, స్టేషన్ రోడ్, సుభాష్ రోడ్, జేపీఎన్ రోడ్, మాయాబజార్ల మీదుగా కొనసాగింది.
వీక్లీ మార్కెట్ ఆలయంలోని అమ్మవారికి కలశాలను సమర్పించారు. అమ్మవారికి ఒడిబియ్యం, పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వేద పండితులు గణేష్, మణికంఠ ఆధ్వర్యంలో వైభవంగా పూజలు చేశారు. అనంతరం తీర్థప్రసాదాల వితరణ చేశారు.
కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ఆకుల బాలకిషన్, గోపి, సంఘం అధ్యక్షుడు తిరుపతి, కార్యదర్శి నరేష్, కోశాధికారి వేణు, 26వ వార్డ్ కౌన్సిలర్ మానస, డైరెక్టర్లు, ప్రతినిధులు సురేష్, భరత్, రవి, సాయిలు, రాజేష్, రాజు, రాజేందర్, శంకర్, సత్యం, రమేష్, వెంకట్రాజు, లింగం, నర్సింలు, రాజయ్య, శ్రీనివాస్, మహిళలు పాల్గొన్నారు.