కామారెడ్డి, ఆగష్టు 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని కామారెడ్డి పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం నిజాంసాగర్ చౌరస్తాలో గల రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస శ్రీనివాసరావు మాట్లాడుతూ మనదేశంలో ఐటీ రంగం ఇంత అభివృద్ధి చెందడానికి కారణం స్వర్గీయ రాజీవ్ గాంధీ అని, ఆనాడు రాజీవ్ గాంధీ ఐటీ రంగంలో ఎంతో ఆలోచించి, కొత్త కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టి, ఐటీ రంగాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు.
హరిజన, గిరిజన, పేద ప్రజలకు ఆర్థికంగా అభివృద్ధి చేయాలని ఉద్దేశంతోనే బ్యాంకులను జాతీయం చేయడం, అదేవిధంగా వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వడం, విద్యారంగంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత రాజీవ్ గాంధీదే అన్నారు.
కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్ల రాజు, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు సిరాజుద్దీన్, కౌన్సిలర్ పాత శివ కృష్ణమూర్తి, మాజీ కౌన్సిలర్ గోని శ్రీనివాస్, జొన్నల నర్సింలు, మాజీ ఎంపిటిసి నిమ్మ విజయ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముక్తార్, సర్వర్, బజాజ్, అజీజ్, ఖుర్షీద్, సాజిద్, అతిక్, భాస్కర్, శంకర్, రవి, హైమద్ ఉల్లా, అమ్ముల ముకుందన్, సునీల్ గౌడ్, రామకృష్ణ, సురేష్, బొమ్మ భూమేష్, సల్మాన్, లక్క పతిని గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.