ఆర్మూర్, ఆగష్టు 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ యువజన సమాజ్ ఆధ్వర్యంలో క్షత్రియ నిరుపేద కుటుంబాలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువజన సమాజ్ అధ్యక్షులు జీవి ప్రశాంత్ మాట్లాడుతూ యువజన సమాఖ్య ఆధ్వర్యంలో ప్రతినెల నిరుపేద కుటుంబాలకు బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని అందులో భాగంగా ఆగష్టు నెల బియ్యం పంపిణీ చేశామన్నారు.
ఈనెల దాతగా నవీన్ బియ్యం ఇవ్వడానికి ముందుకొచ్చారని, ప్రతి నెల సంఘ సభ్యులు ముందుకు వచ్చి నిరుపేద కుటుంబాలకు అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో సంఘసభ్యులు కర్తని దినేష్, సుకేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు.