కామారెడ్డి, ఆగష్టు 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 46 వార్డు పసుల గల్లీలో డ్రైనేజీ పనులు ప్రారంభించారు. దాదాపు రెండు లక్షల రూపాయలతో పనులు చేపట్టడం జరిగిందని కౌన్సిలర్ కోయల్ కార్ కన్నయ్య అన్నారు.
వార్డులో గత 25 సంవత్సరాల నుండి అభివృద్ధి నోచుకోలేక పోయిందని, పట్టణంలోని అన్ని వార్డుల కంటే ఈ వార్డు వెనుకబడి ఉండేదని, ప్రస్తుతం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో అలాగే మున్సిపల్ చైర్మన్ నిట్టూ జాహ్నవి, మున్సిపల్ వైస్ చైర్మన్ సహకారాలతో, రాష్ట్ర టిఆర్ఎస్ సీనియర్ నాయకులు నిట్టూవేణు, రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు ముజీబోద్దీన్ సహాయ సహకారాలతో వార్డు అభివృద్ధిలో భాగంగా పనులను చేపట్టడం జరుగుతుందన్నారు.