కామరెడ్డి, ఆగష్టు 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్లాట్ బుక్ చేసిన సమయానికి అనుగుణంగా భూములను రిజిస్ట్రేషన్ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో తహసిల్దార్లతో మాట్లాడారు.
స్లాట్ బుక్ చేసిన రైతు రిజిస్ట్రేషన్లు చేయడంలో జాప్యం చేయవద్దని సూచించారు. తహసిల్దార్ సెలవులో వెళితే ఉప తహశిల్దార్కు ఇంచార్జి ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. భూములకు సంబంధించి ఫిర్యాదులు పెండిరగ్ లేకుండా చూసుకోవాలని కోరారు. వీడియో కాన్ఫరెన్సులో కలెక్టరేట్ ఏవో రవీందర్, సూపరిండెంట్లు సరళ, ఉమలత, సప్న, సువర్ణ, రంజిత్ కుమార్, నారాయణ పాల్గొన్నారు.