మోర్తాడ్, ఆగష్టు 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్ మండల కేంద్రంలోని అన్ని వీధులలో శనివారం గ్రామ సచివాలయ కార్యదర్శి రామకృష్ణ కార్యాలయ సిబ్బంది దోమల నివారణ కొరకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా క్లోరినేషన్ పంపింగ్ అక్కడక్కడ గుంతలలో నీటి నిల్వ ఉన్నచోట ఆయిల్ బాల్స్ వేయడం లాంటి ప్రత్యేక చర్యలు చేపట్టారు.
నీరు నిల్వ ఉన్న మురికి గుంటలలో ఆయిల్ బాల్స్ వేయడం వల్ల మురికి గుంతలలో గల దోమల గుడ్లు నశించి, దోమలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉండదని కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. గ్రామంలో ప్రజలు ఎవరూ కూడా తమ తమ ఇంటి పరిసర ప్రాంతాలలో నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలని అలాగే చెత్తాచెదారం ఉండకుండా చూసుకోవాలని కోరారు.
ఇంటి పరిసరాలలో మురికి గుంటలు ఉండకుండా నీరు నిల్వ ఉండకుండా చేయడంవల్ల దోమల నివారణ జరుగుతుందని దీనివల్ల ప్రజలు తమ తమ ఆరోగ్యాలను కాపాడుకున్న వారమవుతామని కార్యదర్శి వివరించారు. దోమల నివారణకు అధికారులు చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాలకు ప్రజల సహాయ సహకారాలు అందించాలని కార్యదర్శి కోరారు.