నిజామాబాద్, ఆగష్టు 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆయా శాఖలకు సంబంధించి కోర్టుల ఆదేశాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు హాజరు కావడానికి ప్రతి ఆఫీసులో లీగల్ సెల్ ఏర్పాటు చేసుకొని ఒక అధికారిని ఇన్చార్జిగా నియమించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు.
శనివారం కలెక్టరేట్ ప్రగతి భవన్ సమావేశం మందిరంలో జిల్లా అధికారులతో కోర్టు కేసులు, ఉపకార వేతనాలు హరితహారంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఆఫీసులో, మున్సిపల్ కార్యాలయంలో లీగల్ సెల్ ఉండాలని లీగల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని ఇన్చార్జిగా నియమించాలని అన్ని కేసుల గురించి క్లియర్‌గా మెయింటెన్ చేయించాలని అధికారులను ఆదేశించారు.
కేసులకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్ లిస్టు అప్‌డేట్ చేయాలని రిట్ పిటిషన్స్ కౌంటర్ వేయని కేసులకు కౌంటర్ వేయాలన్నారు. వాటిని ఫాలో అప్ చేయాలన్నారు. అన్ని శాఖల కేసులకు సంబంధించి సోమవారం వరకు క్లారిటీతో రావాలన్నారు. ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలని, పిటిషనర్ వైపు నుండి ఆలోచించాలనీ, ఏమైనా న్యాయం చేసే అవకాశం ఉంటే చేయాలని ప్రతి కేసు లోతుగా పరిశీలన చేయాలన్నారు.
రైతు వేదికల్లో ప్లాంటేషన్ పూర్తి కావాల్సిందేనని, వన సేవకులు ఉండేవిధంగా చూసుకోవాలని ప్రతి ఆఫీసులో ప్లాంటేషన్ కావలసిందేనని పూర్తిస్థాయిలో 100కు 100 శాతం కావాల్సిందే అన్నారు. హరితహారం ఆన్‌లైన్ అప్‌డేట్ చేయాలన్నారు. ఉపకార వేతనాలకు సంబంధించి ఆధార్ పిడిఎఫ్ త్వరగా పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు చిత్ర మిశ్రా, చంద్రశేఖర్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.