కామరెడ్డి, ఆగష్టు 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి న్యాయవాదుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని, న్యాయవాదుల అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పేర్కొన్నారు. కామారెడ్డి బార్ అసోసియేషన్ అడ్వకేట్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు గజ్జల బిక్షపతి, దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు శనివారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ న్యాయవాదుల శ్రేయస్సుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. న్యాయవాదుల సంక్షేమ సంఘం భవన నిర్మాణానికి తనవంతు నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో న్యాయవాదులు వెల్ఫేర్ భవన నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు బోర్ రెడ్డి దామోదర్ రెడ్డి, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్, ఉపాధ్యక్షులు గంగాధర్, సీనియర్ న్యాయవాదులు జగన్నాథం, రత్నాకర్ రావు, ఉయ్యాల వాడ నరసింహారెడ్డి, రాజ గోపాల్ గౌడ్, అమృత రావు, నరేష్ కుమార్, పిపి లు, నంద రమేష్, నరేందర్ రెడ్డి, నిమ్మ దామోదర్ రెడ్డి, బత్తుల నారాయణ, తదితరులు పాల్గొన్నారు.