దళితబంధుకు రూ. వెయ్యి కోట్లు

హైదరాబాద్‌, ఆగష్టు 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత బంధు పథకం పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయబడుతున్న కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గానికి మరో రూ. 500 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. హుజూరాబాద్‌ సభ అనంతరం పైలట్‌ ప్రాజెక్టు అమలు కోసం మొత్తం రూ.2000 కోట్ల నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు.

మొదటి విడతలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన రూ.500 కోట్లతో పాటు ఇప్పుడు విడుదల చేసిన రూ.500 కోట్లు కలిపి హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళిత బంధు పైలట్‌ ప్రాజెక్టుకు గాను మొత్తం రూ. 1000 కోట్ల నిధులు విడుదలయ్యాయి. కాగా వారం రోజుల్లోపు మరో రూ. 1000 కోట్లు ప్రభుత్వం విడుదల చేయనున్నది. దాంతో సీఎం ప్రకటించిన రూ. 2000 కోట్ల నిధులు పూర్తి స్థాయిలో విడుదల కానున్నాయి.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »