కామారెడ్డి, ఆగష్టు 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి ప్రభుత్వ దవాఖానలో, సబ్ సెంటర్ పొసానిపెట్లో రెండు క్యాంప్లలో సోమవారం 412 మందికి కోవిషిల్డ్ కరోనా వ్యాక్సిన్ విజయవంతంగా ఇచ్చినట్టు డాక్టర్ షాహీద్ ఆలి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని గ్రామాలలో మంగళవారం నుండి స్పెషల్ డ్రైవ్ లో టీకాలు ఇవ్వబడుతాయని, కావున ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు, ప్రజలు అందరూ క్యాంపులో పాల్గొని తప్పకుండా వ్యాక్సిన్ చేయించుకోవాలని తెలిపారు. తద్వారా కరోనా రహిత మనడలంగా మన మండలాన్ని నిలపాలని అన్నారు.
కార్యక్రమంలో సాధన, దశరథ్ రెడ్డి, మోహన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మహేందర్ రెడ్డి, వైద్య సిబ్బంది భారతి, భువనేశ్వరి, జ్యోతి, దోమల శ్రీధర్, రాజు, పవన్ , చంద్రకళ, మహేశ్వరి, గంగవ్వ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.