బోధన్, ఆగష్టు 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ ఆర్డీవో కార్యాలయంలోని విడియో కాన్పరెన్సు సమావేశపు మందిరంలో మంగళవారం మండల, పట్టణ ప్రజాప్రతినిధులు, అధికారులతో విడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.
పట్టణ, మండలాలలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పున:ప్రారంభం దృష్ట్య తెలంగాణ రాష్ట్ర సంబందిత మంత్రి వర్గం పలు సూచనలు చేశారు. వచ్చే నెల 1 వ తేదీ నుంచి పాఠశాలలు ప్రాంభిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందని, అధికారులు, ప్రజాప్రతినిధులు కోవిడ్, సీజినల్ వ్యాదుల నివారణా చర్యలను పాటిస్తు పాఠశాలలను ప్రారంభించవలసిందిగా ఆదేశించారు.
అదేవిధంగా విద్యార్థులు కోవిడ్ నియమాలను పాటించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా బద్దంగా ఎర్పాట్లు చేయడం జరిగుతుందని ఇందుకు ప్రతీ అధికారి, ప్రజాప్రతినిధి సహకారం ఉండాలని కోరారు. పాఠశాలలు ప్రారంభమయ్యె లోపు పాఠశాలల సమీపంలో కోవిడ్ నిబందనలను, పరిసరాల పరిశుభ్రత లాంటి విధివిదానాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. దీని విషయమై నిర్లక్ష్యం వహించరాదని ప్రభుత్వ విధివిధానాలను పాటిస్తు పాఠశాలల కొనసాగింపు ఉంటుందని సూచించారు.
ప్రతీ పాఠశాలకు ప్రభుత్వ నియమ నిబంధనల ఉత్తర్వులను అందించడం జరుగుతుందని వెల్లడిరచారు. ముందస్తుగా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రత్యేక సమావేశం నిర్వహించి పకడ్బందీ చర్యలను తీసుకోవాలని తెలిపారు. ఎలాంటి నిర్లక్షానికి పాల్పడినా ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి, బోధన్ ఎంపిపి బుద్దె సావిత్రి రాజేశ్వర్, జడ్పీటీసీ గిర్థావార్ లక్ష్మీగంగారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామలింగం, ఎంపిడివో బానావత్ సుదర్శన్, ఎంఈఓ శాంతి కుమారి, ఎంపివో మధుకర్, మండల పరిషత్ కార్యాలయ అధికారులు, మున్సిపల్ అధికారులు ఉన్నారు.