అలసత్వం వద్దు… అన్ని సవ్యంగా జరగాలి…

నిజామాబాద్‌, ఆగష్టు 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబర్‌ 1 నుండి కేజీ టు పిజి వరకు క్లాసులు నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుండి మండల స్థాయి అధికారులతో కలెక్టర్‌ విడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, స్కూల్స్‌, కాలేజీలు వచ్చేనెల ఒకటవ తేదీ నుండి ప్రారంభం అవుతున్నందున విద్యార్థులకు ఎటువంటి సమస్యలు ఇబ్బందులు ఎదురు కాకుండా విద్యాశాఖ పంచాయతీ రాజ్‌ మున్సిపాలిటీ శాఖలు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. రేపటి నుండి 30 ఆగస్టు వరకు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో శానిటేషన్‌ చేయించాలని, విండోసు, డోర్స్‌ చిన్న చిన్న రిపేర్లు చేయించాలన్నారు. విద్యుత్‌, బెంచెస్‌, తాగునీరు చూసుకోవాలన్నారు. స్కూల్‌ రూమ్స్‌ ప్రాపర్‌గా క్లీన్‌ చేయించాలని బిల్డింగ్స్‌ బయట శానిటేషన్‌ గతంలో ఉన్న క్వాలిటీ తేవాలన్నారు.

ప్యూరిఫైడ్‌ వాటర్‌ మిషన్‌ భగీరథ ట్యాప్‌ కనెక్షన్‌ స్కూల్లో ఏర్పాటు చేయించాలన్నారు. స్కూల్‌ ప్రాంగణం నీటుగా లేకుంటే సీజన్‌ డీస్‌ ఇస్‌ వచ్చే ప్రమాదం ఉందన్నారు. టాయిలెట్స్‌ లేని స్కూల్‌లో జిపి నుండి నిర్మించాలని ఉన్నవాటిని మెయింటెన్‌ చేయాలని తెలిపారు. గురువారం స్కూల్స్‌లో పేరెంట్స్‌తో మీటింగ్‌ ఏర్పాటు చేయాలని ప్రజా ప్రతినిధులను లోకల్‌ బాడీస్‌ను ఇన్వాల్వ్‌ చేయాలన్నారు. మెడికల్‌ ఆఫీసర్‌ ఏఎన్‌ఎం ప్రతి స్కూల్లో ధర్మ మీటర్‌, శానిటైజర్‌ సబ్బు మిడ్‌డే మీల్స్‌ దగ్గర హ్యాండ్‌ వాష్‌ గురించి తాగునీటి దగ్గర సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలన్నారు.

ప్రిన్సిపల్స్‌, టీచర్స్‌ మిడ్‌ డే మీల్స్‌ వద్ద ఇన్చార్జిని ఏర్పాటు చేయాలన్నారు. ఎంపీడీవోలు, సర్పంచులకు, పంచాయతీ సెక్రెటరీలకు తెలియజేయాలన్నారు. మెడికల్‌ ఆఫీసర్‌ కోఆర్డినేషన్‌ ఉండాలన్నారు. హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారులు కూడా కేర్‌ తీసుకోవాలని తెలిపారు. హాస్టల్లో చిన్నచిన్న రిపేర్‌ ఉంటే చేయించాలన్నారు. 16 నెలలు వాడకం వాడటం లేదు కాబట్టి వీలైన చోట స్కూల్‌ క్లాస్‌ రూమ్‌లకు కలర్‌ చేయించండన్నారు. కిచెన్‌ షెడ్స్‌ నీట్‌గా ఉండాలని వాటర్‌ ఆగకుండా ఆగిన చోట గ్రావెల్‌ ఫిల్‌ చేయాలని ప్రిన్సిపాల్స్‌ 30వ తేదీ వరకు పనులు జరిగినట్లు సర్టిఫికెట్‌ ఇవ్వాలన్నారు.

18 సంవత్సరాలు దాటిన వారికి కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ఇప్పించాలన్నారు. ఎంపీడీవోలు నాలుగు స్కూల్లలో ఎంపిఓ నాలుగు స్కూల్స్‌లో ఆర్డీవో జిల్లా అధికారులు తిరిగి చూడాలన్నారు. మెడికల్‌, ఆర్‌బిహెచ్‌కె టీమ్స్‌ అలెర్ట్‌గా ఉండాలన్నారు. మెడికల్‌ ఆఫీసర్స్‌ ఫీవర్‌ వచ్చిన పిల్లలకు వెంటనే టెస్టులు చేయాలని కోవిడ్‌ అయితే ప్రైమరీ కాంట్రాక్ట్స్‌ కూడా చేయాలన్నారు. ఆగస్టు 25 నుండి 31 వరకు డీవార్మింగ్‌ డే కార్యక్రమం ద్వారా 1 నుండి ఐదు 15 సంవత్సరాల పిల్లల వరకు ఆల్బెండజోల్‌ టాబ్లెట్‌ ఇవ్వాలన్నారు.

సీజనల్‌ డిసీజెస్‌ షెడ్యూల్‌ ప్రకారంగా 13 క్యాంపులు తప్పక నిర్వహించాలన్నారు. రెగ్యులర్‌ వర్క్స్‌తో పాటు శాంపిల్‌ కలెక్షన్‌ టెస్టింగ్‌ ట్రీట్మెంట్‌ చేయాలన్నారు. మంగళవారం రివ్యూ వరకు హరితహారం పెండిరగ్‌ ఉండకూడదన్నారు. పల్లె ప్రకృతి వనం డంపింగ్‌ యాడ్‌ శానిటేషన్‌ తడి చెత్త పొడి చెత్త సేకరణ ప్రైమరీ వర్డ్స్‌ అని తెలిపారు.

పల్లె ప్రకృతి వనం స్పీడ్‌గా జరగాలన్నారు. హరితహారం, సబ్‌స్టేషన్‌, రైతు వేదిక ఈ వారంలో ప్లాంటేషన్‌ పూర్తిచేయాలన్నారు. రైతు వేదికలకు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్లు చిత్ర మిశ్రా, చంద్రశేఖర్‌, డిఆర్‌డిఓ చందర్‌ నాయక్‌, జెడ్‌పి సిఇఓ గోవిందు, డిఎం హెచ్‌ఓ బాల నరేందర్‌, డిఈఓ దుర్గాప్రసాద్‌, డిపిఓ జయసుధ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »