విద్యాసంస్థలు పండుగ వాతావరణంలో ప్రారంభం కావాలి

నిజామాబాద్‌, ఆగష్టు 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ కారణంగా 16 నెలల విరామ అనంతరం సెప్టెంబర్‌ ఒకటి నుండి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నందున విద్యార్థులు పండుగ వాతావరణంవలె భావించే విధంగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయత్‌ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సూచించారు.

మంగళవారం హైదరాబాద్‌ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, సెప్టెంబర్‌ 1 నుండి కేజీ నుండి పిజి వరకు అన్ని విద్యా సంస్థలు ప్రారంభిస్తున్నందున పిల్లలు ఎటువంటి భయానికి కానీ ఇబ్బందులకు కానీ అవకాశం లేకుండా కరోనాకు ముందులాగా ఉత్సాహంగా విద్యా సంస్థలకు హాజరయ్యే విధంగా ప్రశాంత వాతావరణం కల్పించాలని, ఇందుకు మానిటరింగ్‌ కమిటీ ప్రతిరోజు పరిశీలన చేయాలని అన్నారు.

అంగన్‌వాడి స్కూల్సు ఆవరణలలో టాయిలెట్స్‌ శానిటైజ్‌ చేయించాలని అందుకు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు వారి సిబ్బందితో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, కిచెన్‌ షెడ్స్‌, తాగు నీటి ట్యాంక్లు క్లోరినేషన్‌ చేయించాలని, నల్ల కనెక్షన్‌ లేని స్కూళ్లలో మిషన్‌ భగీరథ వాటర్‌ కనెక్షన్‌ ఇప్పించాలని ఆదేశించారు.

అన్ని ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, డ్రైనేజీ వాటర్‌ సరిగా వెళ్లే విధంగా మోరీలు శుభ్రం చేయించాలని తెలిపారు. పాఠశాలల ఆవరణలలో నీరు నిలవకుండా చూడాలని డిపివోలు, సీఈఓ జెడ్పి, ఎంపీడీవోలు ఈ కార్యక్రమాన్ని చూడాలని స్కూళ్లలో పరిశుభ్రతపై ఈ నెల 30వ తేదీ వరకు హెడ్మాస్టర్‌తో సర్టిఫికెట్‌ తీసుకొని ఎంపీడీవోలు సబ్మిట్‌ చేయాలన్నారు. అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతనే రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నివిధాల ఆలోచించి స్కూళ్లు ప్రారంభించడానికి నిర్ణయించారన్నారు.

కరోనా లక్షణాలు ఉన్న పిల్లలను గుర్తించి హెడ్‌ మాస్టర్‌లు వెంటనే ప్రాథమిక కేంద్రాలలో నిర్ధారణ పరీక్షలు చేయించాలని పాజిటివ్‌ నిర్ధారణ అయితే వెంటనే విద్యార్థి తల్లిదండ్రులకు అప్పజెప్పాలని మిగతా విద్యార్థులకు కూడా పరీక్షలు చేయాలన్నారు. స్కూల్‌ కమిటీలు వేయాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో కమిటీ, పూర్వపు విద్యార్థులతో కమిటీ వేయాలన్నారు, విద్యార్థులు మాస్కులు తప్పనిసరి వాడాలని శానిటైజర్‌ వాడాలని సూచించారు.

ప్రైవేటు స్కూల్స్‌ కూడా పరిశీలించాలన్నారు. ఇండియాలోనే కరోనాను కంట్రోల్‌ చేసిన రాష్ట్రం తెలంగాణనే అన్నారు. విద్యాశాఖకు అన్ని డిపార్ట్మెంట్లు సహకరించాలన్నారు. పట్టించుకోకుంటే ప్రతి ఒక్కరూ బాధ్యులు అవుతారని హెచ్చరించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు తమ పరిధిలోని పాఠశాలలను తప్పక సందర్శించాలని అన్నారు. అవసరమైన చోట చిన్నచిన్న మరమ్మతులు చేయించాలన్నారు.

వీడియో కాన్పరెన్సులో జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి, అడిషనల్‌ కలెక్టర్‌ చిత్ర మిశ్రా, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, జడ్పీ సీఈవో గోవింద్‌, డిఈఓ దుర్గాప్రసాద్‌, మిషన్‌ భగీరథ ఎస్‌ఇ రాజేంద్ర కుమార్‌, డిపిఓ జయసుధ, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆత్మస్థైర్యంతో ఏదైనా సాధించవచ్చు…

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »