వేల్పూర్, ఆగష్టు 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ కార్యాలయంలో హెల్త్ క్యాంప్ నిర్వహించినట్లు డాక్టర్ అశోక్ తెలిపారు.
హెల్త్ క్యాంపును మండల స్పెషల్ ఆఫీసర్ సిహెచ్ విజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాలలో హెల్త్ క్యాంపులను నిర్వహించడం జరుగుతుందని, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. ప్రజలు హెల్త్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్, ఎంపీటీసీలు, ఆరోగ్య సూపర్వైజర్లు వనమాల, నాగమణి, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.