నిజామాబాద్, ఆగష్టు 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గ్రీన్ చాలెంజ్‌కు సమాధానంగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కలెక్టరేట్‌లో బుధవారం మొక్కలు నాటి నీరుపోశారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ క్లీన్ గా గ్రీన్ గా ఉండాలనే దాంట్లో భాగంగా గ్రీనరీ పెంచే క్రమంలో గ్రీన్ ఛాలెంజ్ చాలా ఉపయోగ పడుతున్నదని తాను ముగ్గురిని నామినేట్ చేశానని మహబూబ్ నగర్, మెదక్, జనగామ కలెక్టర్లకు గ్రీన్ డే చాలెంజ్ పంపించానని అన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో భోజ నారాయణ పాల్గొన్నారు.