రుణ లక్ష్యాలు నెలాఖరులోగా సాధించాలి..

కామారెడ్డి, ఆగష్టు 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బ్యాంకు లింకేజీ రుణాలను, స్త్రీ నిధి, మెప్మా రుణాలు, పంట రుణాలు, పంటల నమోదు, రైతు బీమా లక్ష్యాలను ఈనెల చివరి లోగా సాధించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన డిపిఎం, ఎపిఎం, వ్యవసాయ శాఖ, ఏడి, ఏవో, ఏఇవో స్త్రీ నిధి మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా బ్యాంకు లింకేజీ రుణాలను, స్త్రీ నిధి, మెప్మా రుణాలు, పంట రుణాలు, పంటల నమోదు, రైతు బీమా లక్ష్యాలను మండలాల వారిగా సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, బాన్సువాడ, పెదకొదపుగల్‌ మండలాలు బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి, మెప్మా రుణాలలో మంచి ప్రగతి సాధించినందుకు అధికారులను అభినందించారు. నస్రుల్లాబాద్‌, మాచారెడ్డి, దోమకొండ, తాడ్వాయి, కామారెడ్డి మండలాలు లక్ష్యాలలో వెనుకబడి ఉన్నాయని అంటూ 55 శాతం ఖచితంగా సాధించాలని, 55 శాతం సాధించిన వారు ఈనెల 31లోగా 60 శాతం సాధించాలని ఆదేశించారు. మెప్మా రుణాలలో 60 శాతం సాధించామని, ఈ నెల చివరిలోగా 65 సాధించాలని తెలిపారు.

స్త్రీ నిధి రుణాల గురించి మాట్లాడుతూ మదునూర్‌ మండలం 18 శాతం మాత్రమే లక్ష్యాన్ని సాధించిందని, అసిస్టెంట్‌ మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే దోమకొండ మండలం కూడా 22 శాతం మాత్రమే లక్ష్యాన్ని సాధించిందని తెలియచేస్తూ ఈ నెలాఖరు వరకు 40 శాతం సాధించాలని, 30 శాతం సాధించిన మండలాలు ఈ నెలాఖరు వరకు 50 శాతం సాధించాలని ఆదేశించారు. స్త్రీ నిధి రుణాల కింద లబ్దిదారులకు గేదెలు అందించడంలో ఒక యూనిట్‌ కింద 93 వేల 270 రుపాయలతో ఒక గేదె అందించడం జరుగుతున్నదని, జిల్లాకు 2 వేల 500 యూనిట్ల లక్ష్యానికి గాను 1 వేయి 700 యూనిట్‌లకు లబ్దిదారులను గుర్తించడం జరిగిందని, ఈ నెల 31 లోగా మిగిలిన లబ్దిదారులను గుర్తించాలని ఆదేశించారు.

మహిళా సమాఖ్యలు తమకు ఆదాయాన్ని అందించే చిన్న కుటీర పరిశ్రమలపై అవగాహన పెంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మహిళలు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు అంటే పిండి మిల్లు, ఆయిల్‌ మిల్లు, కిరాణా దుకాణాలు, పప్పు మిల్లులు ఏర్పాటు చేసుకోవడానికి లబ్దిదారులను గుర్తించాలని, వారికి అందించే పరిశ్రమలకు గ్రామాలలో క్వాలిటీ ఆహార వస్తువుల మార్కెట్‌ పరిస్థితులను పరిశీలించాలని, ప్రభుత్వ గురుకుల స్కూల్స్‌, వసతి గృహాలకు అవసరమైన వాటిని పంపిణీ చేసేలా పరిస్థితులను అధ్యయనం చేయాలని, మండల సమాఖ్య, గ్రామా సంఘాలను అవగాహన పరచాలని సూచించారు.

పంట రుణాలకు సంబంధించి ఈ నెల చివరిలోగా 80 శాతం లక్ష్యాన్ని సాధించాలని అన్నారు. బిర్కూర్‌ 70 శాతం సాధించిందని అభినందించారు. బాన్సువాడ 55 శాతం మాత్రమే సాధించిందని తెలిపారు. వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో కృషి చేసి సాధించాలని ఆదేశించారు. రైతు బీమాలో మిగిలిన అకౌంట్స్‌ తక్షణమే పూర్తి చేయాలని తెలిపారు.

రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని, ఇప్పటి వరకు ఎరువుల పంపిణి బాగుందని, ఇప్పటి వరకు 46 వేల 978 మెట్రిక్‌ టన్నులు సప్లై చేసామని, 5 వేల 242 మెట్రిక్‌ టన్నుల ఎరువు అందుబాటులో ఉందని, కృత్రిమ కొరత లేకుండా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి అదనపు కలెక్టర్‌ డి. మాధవ రావు, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా లీడ్‌ అధికారి రాజేందర్‌ రెడ్డి, మెప్మ శ్రీధర్‌ రెడ్డి, స్త్రీ నిధి ఎజిఏం రవికుమార్‌, డిపిఏం రమేష్‌, సుధాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »