వేల్పూర్, ఆగష్టు 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వేల్పూర్ మండలంలోని లాక్కొరా గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించినట్టు వైద్య సిబ్బంది సిహెచ్ వెంకటరమణ, ఏఎన్ఎం భాగ్య తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య శిబిరంలో గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. హెల్త్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆశ వర్కర్లు భూలక్ష్మి, సుకన్య, కళావతి, మీనా, సింధుజ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.