బోధన్, ఆగష్టు 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ పట్టణంలోని పెంటకుర్ద్ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ ప్రహరీ గోడని ఆనుకోని అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న మజీద్ నిర్మాణాన్ని నిలిపివేయాలని, భవిషత్తులో ఇక్కడి పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎన్నో సమస్యలకు కారణమవుతుందని బిజెవైఎం రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మేరకు బోధన్ ఆర్‌డివోకు బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ విద్యాలయాలకు దగ్గరలో ప్రార్థన మందిరాల నిర్మాణాలు చేయకూడదనే జీవోను కూడా లెక్కచేయకుండా స్థానిక ఎమ్మెల్యే అండదండలతో పాఠశాల ప్రహరీ గోడకు ఆనుకోని నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారన్నారు.
ఇక్కడి పాఠశాలలో చదివే పిల్లల భవిషత్తు దృష్టిలో పెట్టుకొని వెంటనే ఇట్టి అక్రమ మజీద్ నిర్మాణాన్ని ఆపివేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల భారతీయ జనతాయువమోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయవలసి వస్తుందని హెచ్చరించారు.