నిజామాబాద్, ఆగష్టు 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా న్యాయవాద సహకార పరపతి సంఘం 2021`22 వార్షిక ఎన్నికలు ఈనెల 27న జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్టు ఎన్నికల అధికారులు బండారి కృష్ణానంద్, జగన్మోహన్గౌడ్ తెలిపారు.
ఉదయం 11 గంటల నుండి సాయంతర్ర 4 వరకు పోలింగ్ కొనసాగుతుందని, న్యాయవాదులు కోవిడ్ నిబంధనలు పాటించి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని వారు కోరారు.
మొత్తం 8 డైరెక్టర్ పదవులకు గాను పదిమంది న్యాయవాదులు పోటీలో ఉన్నారని, ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాలని తెలిపారు. అదేరోజు ఓట్ల లెక్కింపు నిర్వహించి పూర్తిస్థాయి సొసైటీ కార్యవర్గాన్ని అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, కోశాదికారి ఎన్నిక నిర్వహిస్తామన్నారు.